September 13, 2026
Praja Telangana
తెలంగాణ

బాల భరోసాతో చిన్నారులకు ప్రత్యేక వైద్యం__జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాల భరోసా కార్యక్రమం కింద జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల అవగాహన శిబిరాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 38,700 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి,21 మంది చిన్నారులను ప్రత్యేక వైద్య సేవల కోసం గుర్తించినట్లు తెలిపారు. పిల్లల్లో ఎదుగుదల లోపాలు, మానసిక సమస్యలు,పోషకాహార లోపాలను ముందుగానే గుర్తించడం ద్వారా అంగవైకల్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.అనిత,డాక్టర్ వేదవ్యాస్,రౌఫ్,బుక్క వెంకటేశ్వర్, వైద్యులు,ఆర్‌బీఎస్‌కే సిబ్బంది,అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*సైబర్‌ మోసాలకు అత్యాశ.. భయమే ఆయుధం.. అప్రమత్తతతోనే రక్షణ: డీసీపీ ఏ. భాస్కర్*

మందమర్రిలో వరుస బైక్ చోరీలకు తెరదించిన పోలీసులు

*పంటల వైవిధ్యీకరణపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Share this