మంచిర్యాల,47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రవీందర్ రావు ప్రచారం
మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 47వ డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి బాటలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి,ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థి కోరారు. కార్పొరేటర్ గా అధికారంలోకి రాగానే మొదటి రోజు నుండే ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని,వారికి ఏ కష్టం వచ్చినా 24 గంటలు ఒక సేవకుడిగా పని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి పార్టీ సెంట్రల్ జోన్ కన్వీనర్ రెడ్డిమల్ల అశోక్,సెంట్రల్ జోన్ కో కన్వీనర్లు భరత్ రాజు, స్వాతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

