September 11, 2026
Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి, పట్టణంలో రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

బెల్లంపల్లి, పట్టణంలో రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

బెల్లంపల్లి ,పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ శనివారం పరిశీలించారు.
కమిషనర్ మాట్లాడుతూ, సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి కంటా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి కోసం ప్రభుత్వ గ్రాంట్లతో మొత్తం ఎనిమిది కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు, ఇతర అడ్డంకులు తొలగించడంతో ఏరియా ఆసుపత్రి నుంచి కాంతా వరకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.అదే విధంగా కంటా చౌరస్తా నుంచి కన్నాల పైవంతెన వరకు రోడ్డు మరమ్మత్తులు, అభివృద్ధి పనుల కోసం నాలుగు కోట్లు మంజూరు అయ్యాయని, ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. రోడ్డు వెడల్పు ప్రాజెక్టులో భాగంగా శిశు మందిర్ పాఠశాల రహదారి అభివృద్ధి కూడా త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. సంబంధిత రహదారి గుర్తింపు గీతల పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ సాయికిరణ్, ఏఈ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

*మంత్రాలు చేస్తున్నారనే మూఢనమ్మకంతో మహిళ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్టు*

*సేవా స్పూర్తికి ప్రతిరూపాలు వైద్యులు___జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం*

Chief Editor: Satish Kumar

*వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి… డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

Share this