September 11, 2026
Praja Telangana
తెలంగాణ

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ వర్క్ షాప్

హనుమకొండ కు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 23 ఆదివారం రోజు ఉదయం 9-11 గంటల వరకు మాస్టర్జీ హై స్కూల్, కిషన్ పుర, హనుమకొండ నందు నర్సరీ నుండి పదవ తరగతి చిన్నారుల వరకు క్రాఫ్ట్ వర్క్ షాప్ నిర్వహిస్తూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు… రెండు గంటల వ్యవధి లో 4 విభాగాలుగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, పాల్గొన్న అందరికీ మెరిట్ సర్టిఫికెట్స్, మెడల్స్, చక్కని ప్రతిభ చూపించిన వారికి ప్రత్యేక బహుమతులు అందిస్తున్నామని, చిన్నారులలో దాగున్న సృజనాత్మకత వెలికి తీయడానికి ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఇతర వివరాలకు 8143643337 లో సంప్రదించవచ్చని అన్నారు..

Related posts

*ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి*

గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు.. అవసరమైతే పీడీ యాక్ట్ అమలు : సీపీ అంబర్ కిషోర్ ఝా

*చేయూత సామాజిక భద్రత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Share this