September 12, 2026
Praja Telangana
తెలంగాణ

నెన్నెల్ లో కత్తిపోటు నిందితుడు అరెస్ట్

నెన్నెల్ లో కత్తిపోటు నిందితుడు అరెస్ట్

వివరాలు తెలిపిన రూరల్ సీఐ హనుక్

నెన్నెల్ ప్రాంతంలో ఆటోకారు ఢీకొనడంతో జరిగిన వాగ్వాదంలో ఆటో డ్రైవరు కోడిప అశోక్ కత్తితో దాడి చేసిన ఘటనపై క్రైమ్ నెంబర్ 166/2025 కింద కేసు నమోదు చేశారు.
సాయంత్రం జోగపూర్ వద్ద కారులో ఉన్న ఛీర్ల హరీష్ మీద అశోక్ కత్తితో ఎడమ ఛాతీ, పొట్ట వద్ద పొడవడంతో హరీష్ అక్కడికక్కడే కిందపడిపోయాడు. పెరిగిన ఉద్రిక్తతలో పిర్యాది చీర్ల సురేష్‌ను కూడా పొడవడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడంతో నిందితుడు పారిపోయాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు గాలింపు చేపట్టి ఈ రోజు చిత్తాపూర్ పాఠశాల దగ్గర మామిడి తోటలో దాక్కున్న అశోక్‌ను అదుపులోకి తీసుకుని, అతని ఆటోతో పాటు కత్తిని స్వాధీనపర్చారు. ఘటనకు సహకరించిన చిందం అంజి, కోడిపే రాజుపై కూడా అభియోగాలు నమోదు చేశారు.

Related posts

*సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.. చెన్నూర్‌లో జనసేన శ్రేణుల సందడి*

*యంగ్ ఇండియా ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య*

డెంగ్యూపై నిర్లక్ష్యం ప్రాణాంతకం.. అప్రమత్తతే రక్షణ : కలెక్టర్ కుమార్ దీపక్

Share this