Praja Telangana
తెలంగాణ

*రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ దశాబ్దాల కళ నెరవేరిన ఆగని ప్రమాదాలు*

బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు గారు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు,నాయకులకు అందరికీ జై భీమ్ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న విధంగా తయారయింది రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పరిస్థితి అని తెలిపారు. ఎందుకంటే దశాబ్దాల కల నెరవేరింది అనుకున్న సంతోషం లేకుండా పోయిందని తెలిపారు.రాత్రి పూట ప్రజలు రామకృష్ణాపూర్ కు రావాలంటేనే భయపడుతున్నారు అని వాపోయారు.ఎందుకంటే గతంలో ట్రాక్ దాటడానికి ప్రయత్నించి చాలామంది మరణించడం జరిగిందని, ఇప్పుడు ఫ్లైఓవర్ అయినా కూడా అదే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చీకట్లో స్ట్రీట్ లైట్లు లేక ఎంతోమందికి యాక్సిడెంట్ కు గురి అవుతున్నారని తెలిపారు.నిన్న రాత్రి మేము రామకృష్ణాపూర్ వస్తున్న సమయంలో విధులకు వెళ్తున్న ఒక ఉద్యోగి ఆగి ఉన్న ట్రాలీని కనబడక వెనక నుండి ఢీకొనడం రోడ్డుమీద పడిపోవడం జరిగిందని, అతనికి హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాలతో బతికి బయటపడడం జరిగిందని తెలిపారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పైన పనికిరాని బొమ్మలు వేయడం కాదు ప్రజలకు ప్రాణాలు కాపాడే పనులు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఫ్లైఓవర్ పైనున్న యూటర్న్ చాలా దారుణంగా ఉందని,తాత్కాలికంగా రిపేర్ చేయాలని గతంలో ఉన్న ప్రభుత్వం పని చేయట్లేదని ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలను పట్టించుకోవడంలేదని తెలిపారు.కావున వెంటనే రామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వేయాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని, మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్,ఇంచార్జ్ దాగం శ్రీనివాస్,జిల్లా నాయకులు మతిన్ ఖాన్ మంద వారి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్,రామకృష్ణాపూర్ పట్టణ నాయకులు బొల్లి నరేష్, రాజేష్,మండల నాయకులు, తోటపల్లి రవి, చిలుముల గణేష్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం.

విశ్వకర్మలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలి*

Chief Editor: Satish Kumar
Share this