September 10, 2026
Praja Telangana
తెలంగాణ

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన భీమారం మండలం యువకులు

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మత్స్యకారుల సంఘం కమ్యూనిటీ భవనంలో దెబ్బేటి శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది. వారికి జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పరాయి పార్టీ జెండాలను పక్కనబెట్టి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను గ్రామస్థాయిలో బలోపేతం చేసి రానున్న రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలో వచ్చేంతవరకు కృషి చేస్తామని తెలిపారు. మహేష్ వర్మ మాట్లాడుతూ.. ప్రజలు చైతన్యం అయ్యారని, అగ్రవర్ణాల రాజకీయ పార్టీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న గారితోనే మన రాజ్యాధికారం వస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. వచ్చేది బీసీల రాజ్యమే అని, 2028లో బీసీ ముఖ్యమంత్రి అది తీన్మార్ మల్లన్న గారే అని స్పష్టం చేశారు.

Related posts

*తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు*

Chief Editor: Satish Kumar

*ఉల్లాస్ యాప్‌పై మెప్మా సిబ్బందికి శిక్షణ.. నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యం: విద్యాశాఖ ప్రాజెక్ట్ అధికారి ఎం. శ్రీనివాస్*

అకాల వర్షాల బీభత్సం — కళ్లముందే నేలమట్టమైన పంటలు, ఆందోళనలో రైతులు

Share this