బెల్లంపల్లిలో ఏసీబీ దాడులు పట్టుబడ్డ అధికారిణి
నేటి ప్రజా తెలంగాణ
బెల్లంపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులను నిర్వహించారు. పట్టణంలోని కార్మిక సహాయ అధికారి కార్యాలయంపై దాడులు చేశారు. ఓ మహిళ వద్ద నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.