బుద్ధునితో నా ప్రయాణం పోస్టర్ ఆవిష్కరణ
మంచిర్యాల,డి ఆర్ డి ఓ కిషన్ చేతుల మీదుగా బుద్ధునితో నా ప్రయాణం అనే తెలుగు నాటకం వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ
మంచిర్యాల జిల్లా ప్రజలకి చక్కటి అవకాశం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు జులై 11న సాయంత్రం 6:గంటలకు లకు జిల్లా కేంద్రంలో ఎం కన్వెన్షన్, ఫైర్ స్టేషన్ ఎదురుగా, బెల్లంపల్లి చౌరస్తాలో దగ్గరలో బుద్ధునితో నా ప్రయాణం అనే తెలుగు నాటకo ప్రదర్శించబడును, కావున పిల్లలు, పెద్దలు, అంబేద్కర్, బౌద్ధ వాదులు, మేధావులు, దళిత బహుజన వాదులు అందరు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.ఈకార్యక్రమంలో తొగరి సుధాకర్, కూన రవి కుమార్, దాసరి వెంకట రమణ, గొడిసెల దశరథ్, గజల్లి రాజమల్లు తదితరులుపాల్గొన్నారు.