July 28, 2026
Praja Telangana
తెలంగాణ

అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్‌ అధికారి కుమార్తె మేఘన.

ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించి కాంస్య పతకం సాధించిన ఏసీపీ సాదుల సారంగ పాణి కుమార్తె మేఘన రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా,ని మర్యాద పూర్వకంగా కలవగా సీపీ ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే… టిజిపిఎ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ సారంగపాణి కుమార్తె గత కొన్ని సంవత్సరాలుగా పిస్టల్ షూటింగ్‌లో ISSF జూనియర్ ప్రపంచ కప్ 2023, జర్మనీ, జట్టు బంగారు పతకం, ఆసియా ఛాంపియన్‌షిప్ 2023, దక్షిణ కొరియా, జట్టు వెండి పతకం, ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్, దక్షిణ కొరియా 2023లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 3 జాతీయ ఛాంపియన్‌షిప్ పతకాలు మరియు బహుళ తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పతకాలు: జూనియర్ వ్యక్తిగత కాంస్య, జూనియర్ సివిలియన్ కాంస్య, సీనియర్ జట్టు వెండి, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంస్య పతకం సాధించడం జరిగింది. విలువిద్యలో జాతీయ స్థాయి పోటీల్లో తన సత్తా చాట్టడం జరిగింది..ఈ సందర్బంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ తన కార్యాలయములో సాదుల మేఘన ని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ తమ పిల్లలను క్రీడల్లో వున్న ఆసక్తి గమనించి వారిని ప్రోత్సహించాలని, ముఖ్యంగా నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు సైతం తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిమచడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందించడం సంతోషదాయకమని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Related posts

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి_ జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య

Chief Editor: Satish Kumar
Share this