Praja Telangana
తెలంగాణ

హనుమకొండలో దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

హనుమకొండలో దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద హనుమకొండ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్‌ను ఆదివారం (21-12-2025) ఆవిష్కరించగా, ఈ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా నిర్మాణ కమిటీ చైర్మన్ సాగంటి మంజుల అధ్యక్షతన నిర్వహించారు. ఖమ్మం జిల్లా చైర్మన్ షేక్ అబ్దుల్ రెహ్మాన్, భూపాలపల్లి జిల్లా చైర్మన్ ములకలపల్లి లక్ష్మీ చౌదరి, భువనగిరి జిల్లా చైర్మన్ సుర్కంటి పారిజాత, మహబూబాబాద్ జిల్లా వైస్ చైర్మన్ రావుల శ్రీనివాస్, కోదాడ నియోజకవర్గం చైర్మన్ అంకతి అనసూయ, మునుగోడు నియోజకవర్గం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం, ర్యాలీగా హనుమకొండ పెన్షన్ ఆఫీస్‌కు చేరి, 10,000 రూపాయల పెట్టుబడితో సినిమా నిర్మాణంలో సహనిర్మాతలుగా చేరిన సబ్బండ వర్గానికి చెందిన 26 మందికి శాలువా మరియు ప్రశంస పత్రాలు అందజేయబడ్డాయి.
చిత్ర దర్శకుడు ఎం. సేనాపతి మాట్లాడుతూ, “ఇప్పటికైనా తెలంగాణ వీరుల చరిత్రలు బయటకి రావాలి అన్న ఆలోచనతో వెయ్యి మంది సహనిర్మాతలతో దొడ్డి కొమరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నాం” అని తెలిపారు.కార్యక్రమంలో వరంగల్ జిల్లా చైర్మన్, సహనిర్మాతలు, ఖమ్మం జిల్లా గౌరవ సలహాదారులు, భువనగిరి, నల్గొండ, హనుమకొండ జిల్లా సహనిర్మాతలు, సహ నిర్మాతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

Related posts

శభాష్ దేవాపూర్ పోలీస్ అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడిన దేవాపూర్ ఎస్‌ఐ గంగారం,

రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

విశ్వకర్మలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలి*

Chief Editor: Satish Kumar
Share this