Praja Telangana
తెలంగాణ

ముఖ్యమంత్రిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

ముఖ్యమంత్రిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సుమారు 85 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందడం అభినందనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఇదే విధంగా ప్రజా సమస్యలపై ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే ఈ విజయానికి కారణమని తెలిపారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, గెలిచిన సర్పంచులతో కలిసి గ్రామాల అభివృద్ధికి నిరంతరం పని చేస్తామని చెప్పారు.

Related posts

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకో అవకాశం ఇవ్వండి: రాజాసింగ్

47 వ డివిజన్ లో గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు

Share this