Praja Telangana
తెలంగాణ

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీహెచ్పీఎస్ జాతీయ నాయకులు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొంతుకు సుదర్శన్ లు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు మరవలేనివని అన్నారు. బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అని, బహుజన వర్గాల ప్రజలు చదువుకొని విద్యావంతులై మంచి అభ్యున్నతి సాధించాలని, అంతిమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలు రాజ్యాధికార వైపు ప్రయాణం చేసి రాజ్యాధికారం సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బిసి సంఘం జిల్లా నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్, గాజుల ప్రతాప్, బై రాజు శ్రీనివాస్, కడారి జీవన్ కుమార్, ఆంజనేయ గౌడ్, దుర్గయ్య, బండి శంకర్ గౌడ్, చంద్రమౌళి, శ్రీనివాస్, దుర్శట్టి రాములు, భాస్కర్, గోపాల్, మురళి గౌడ్, రాజా గౌడ్, కళ్యాణ్, ఆటో యూనియన్ నాయకులు రాజేశం, శ్రీనివాస్, రాములు, శ్రీనివాస్, లక్ష్మణ్, రవి, అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనకు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రం ఎంపిక

ఘనంగా వివేకవర్ధిని డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశం

బీసీల నాయకత్వంలో బహుజనుల రాజ్యాధికారం

Share this