Praja Telangana
తెలంగాణ

గురుకులంలో స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు

గురుకులంలో స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు

బెల్లంపల్లి పట్టణంలోని
తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల, కళాశాలలో స్టూడెంట్స్ అకాడమిక్ యాక్టివిటీలో భాగంగా సోమవారం స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్ మాట్లాడుతూ కెప్టెన్ ,వైస్ కెప్టెన్ ఎన్నిక కొరకు ప్రజా పద్ధతిలో ఎన్నికలు నిర్వహణ కోసం విద్యార్థులు ఎవరికైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఆ విద్యార్థులు నామినేషన్ వేసి పోటీ చేస్తున్నారని అన్నారు. నామినేషన్ చేసిన ప్రతి విద్యార్థి తమ హామీలను పాఠశాల కళాశాలలో వనరులను సమర్ధవంతంగా ఎలా వినియోగించుకోవాలో బోధన బోధనేతర విషయాలలో ఎలా ఉండాలో ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. ఈ స్కూల్ ఎన్నికలలో కెప్టెన్ నలుగురు వైస్ కెప్టెన్ నలుగురు పోటీ చేశారు. వారికి తగిన చిహ్నాలను కేటాయించడం జరిగినది. రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ స్వీకరణ ,తిరస్కరణ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ , పోలింగ్ బూత్ ఏజెంట్లను, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఓటింగ్ వేసిన విద్యార్థులకు చూపుడువేలు పైన సిరా గుర్తును వేశారు. పాఠశాలలోని విద్యార్థులు తమ ఓటు హక్కును వంద శాతంవినియోగించుకున్నారు. ఈ విధంగా విద్యార్థులు సక్రమంగా ఓటు వేసే విధంగా విధులు నిర్వహించారు. విద్యార్థులు ఏజెంట్లుగా ఉండి బ్యాలెట్ పత్రాలను చక్కగా జాగ్రత్త పరిచారు. ఈ పోలింగ్ లో భాగంగా త్రీ టౌన్ తాళ్ల గురజాల ఎస్సై రమేష్, ఏఎస్ఐ అలీ విచ్చేసి ఓటింగ్ సరళిని చూసి తగిన సూచనలను విద్యార్థులకు ఇచ్చారు. విద్యార్థులు ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించిన విధానానికి ఎస్సై, ఎ ఎస్ ఐ అభినందించారు. అనంతరం ఓట్లను లెక్కించారు. దానిలో గెలిచిన కెప్టెను , వైస్ కెప్టెన్ ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు రమేష్,
పి నరేందర్, ఎ .శైలజ, ఎల్ శ్రీనివాస్, ఎస్ మంజుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచిర్యాల‌ జిల్లాలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం

భూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Share this