బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు
ప్రపోజ్ చేసిన కొయ్యల ఏమాజి , పోషం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడుగా సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఎన్నిక పట్ల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాదికి, పార్టీ విధేయునికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఆయన క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడు అని తెలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పేరును ప్రపోజ్ చేసే అవకాశం నాకు కల్పించి గౌరవం కల్పించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన నామినేషన్ పత్రాలపై కొయ్యల ఏమాజి, అరుముల్ల పోషం ప్రపోజ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన రామచందర్ రావు ను అభినందించారు.