జూలై 9 దేశవ్యాప్త సమ్మెకు జే ఏ సి పిలుపు
హెచ్ ఎం ఎస్ కార్యాలయంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ
జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను విజయవంతం చేస్తూ సింగరేణి కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు అప్పజెప్పడమే ధ్యేయంగా బి.జె.పి. ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక హక్కులను కాలరాసి 40కోడ్ లను కుదించి 4కోడ్లగా మార్చి కార్మికరంగానికి ధ్రోహంతలపగడుతున్న ఎన్ డి ఏ. ప్రభుత్వ తీరును ఐక్యకార్మిక కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జేఏసీ నాయకులు తెలిపారు.
కేంధ్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దాదాపు దశాబ్ధకాలంగా సింగరేణి కుంటుపడింది కార్మికులు 2013 లో 78 వేలమంది కార్మికులుంటే 2025 లో 39 వేలమందికి కుదింపబడింది గనులు సగానికి సగంమూతపడ్డాయి.సింగరేణి సంస్థ వందలకోట్లతో అణ్వేషించిన మన గనులను సింగరేణి సంస్థకు అలాటుమెంటు చేయకుండా తధ్వారా ప్రైవేటు సంస్థలకు దారాధత్తం చేయడానికి మన బొగ్గుబాయిలను 12 యేండ్లనుండి మనకు కాకుండా చేయడానికి వ్యతిరేకంగా ఉధ్యమించాలని సింగరేణి కార్మికులకు పిలుపునిస్తున్నాం. 12 యేండ్లనుండి సింగరేణికి ఒక్క బొగ్గుగనిని రాకుండా చేయడం సింగరేణిని చెరబట్టడం తెలంగాణకు ధ్రోహం చేయడమేనని సింగరేణి ఐక్య కూటమి సంఘాలు నిర్థారించాయి. ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 9 న తలబెట్టిన దేశవ్యాప్త బొగ్గుగనుల సమ్మెను విజయవంతం చేయడానికి సింగరేణి కార్మికులందరూ ఏకతాటిపై నిలబడి సమ్మెను విజయవంతం చేయాలని ఉధ్యమ జేఏసీ యూనియన్లన్నీ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ నాయకులు మందమర్రి వైస్ ప్రెసిడెంట్ జే.శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాసరెడ్డి , సదానందం , జెల్లిరాజేష్ , ఐ.ఎఫ్.టి.యు. జిల్లా ప్రెసిడెంట్ టి.శ్రీనివాస్, ఎం.డి.జాఫర్ , మేకలసురేందర్, మనోహర్ టి.ఎన్.టి.యు.సి్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనిరాంసింగ్, వాసాల సంపత్ తదితరులు పాల్గొన్నారు.