*భూభారతి చట్టంను గ్రామంలో రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా అమలు చేయాలి*
*పెంచిన బస్ చార్జీలు, ఇతర అన్ని రకాల నిత్యవసర అధిక ధరలను నియంత్రించాలి*
*బెల్లంపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన ఎం సి పి ఐ యు పార్టీ నాయకులు*
ఎం సిపిఐయు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బెల్లంపల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో కి ఎం సిపిఐ యు పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసలేటి వెంకటేష్, మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీలను ప్రజలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించినారని ఏడవ గ్యారంటీ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణను విశ్వసించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఒకటి, రెండు హామీలు తప్ప మిగిలిన ఎన్నికల హామీలకు బడ్జెట్ లేదని, ఈ సంవత్సరం ఆరు నెలల కాలం గడిపినారు. ప్రజాస్వామిక హక్కులపై గత పాలకులులే నిర్బంధాలు తీవ్రమయ్యాయని, గత పాలకులను ఓడించి మిమ్ములను గద్దెనెక్కించితే పరిపాలనను ప్రజా అనుకూలంగా చేయడంలో వైఫల్యం చెందినారని రాష్ట్రంలో విద్య, వైద్యం దోపిడీ విచ్చలవిడిగా పెరిగిందని సీజన్ వ్యాధులు విజరుంపన జరుగుతున్న గ్రామంలో హెల్త్ క్యాంపులు లేవని, రాష్ట్రంలో ఇప్పటికీ వందలాది గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, జాతీయ రహదారుల మినహా మిగిలిన రహదారులు ( రోడ్లు) పై ప్రయాణం చేయాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయని, రాష్ట్రంలో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ మాఫియా తమ గుప్పెట్లోకి తీసుకొని వ్యాపారం చేస్తున్న అధికారులు నిరోధించడం లేదని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కార్యకలాపాలు, ఇతర అవసరాలకు ప్రభుత్వ భూములు లేకుండా చేసే పరిస్థితి ఉన్నదని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వటం లేదని, పేద ప్రజలకు అందడం లేదని, రాజకీయ నాయకుల జోక్యం వలన అసలైన అలబ్ధిదారులు మోసపోతున్నారని, వయస్సు పైబడిన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రభుత్వం చేయూత పింఛన్లు, మీరు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, కానీ బస్ చార్జీలు, రైలు చార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి అని, ఈ పరిస్థితులలో పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎం సిపిఐయు మండల కమిటీ తరఫున కోరుతున్నాం కావున తమరు మా యందు దయవుంచి ఈ క్రింద పేర్కొనబడిన డిమాండ్స్ ను తక్షణమే పరిష్కరించాలని ఎం సి పి ఐ యు పార్టీ మండల కమిటీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్స్
ఎన్నికల్లో ఇచ్చిన ఆర్ గ్యారంటీలలో భాగం అయిన చేయూత పెన్షన్, ఆటో కార్మికులకు హామీ ఇచ్చిన నెలకు 12 వేల రూపాయలు, వ్యవసాయ కార్మిక సంక్షేమం కోసం సంవత్సరమునకు ఇస్తానన్న రూపాయలు 15000 రూపాయలు, కౌలు రైతులకు ఇచ్చిన హామీ మహిళలకు నెలకు 2500 హామీ తక్షణమే అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులకు, కళాకారులకు ఇంటి స్థలం, నెలకు 25 వేల రూపాయల హామీని, జర్నలిస్టులకు ఇంటి స్థలం హామీలకు తక్షణమే అమలు చేయాలి
భూభారతి చట్టంలో గ్రామంలో రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా అమలు చేయాలి
పెంచిన బస్సు చార్జీలు ఇతర అన్ని రకాల నిత్యావసర అధిక ధరలను నియంత్రించాలి
అన్ని గ్రామాలకు పక్కా రోడ్లను నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలి
పేద ప్రజలు వేసుకున్న గుడిసెల ఇళ్ల స్థలాలకు పట్టాలి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వ భూములు పరిరక్షణకు కఠినంగా చర్యలు తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ మాఫియా భారీ నుంచి ప్రభుత్వ భూములు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి,
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి
విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ రంగం నుండి తొలగించి ప్రభుత్వ రంగంలోకి తీసుకొని రావాలిప్రజల కనీస ప్రజాస్వామిక హక్కు అయినా నిరసన హక్కుకు గ్యారెంటీ ఇచ్చి ఈ ప్రభుత్వం లో సభలు, సమావేశాలను, నిరసన కార్యక్రమాలను, అణచివేతకు గురిచేయడాన్ని తక్షణమే వీరనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి ఆరెపల్లి సతీష్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.