Praja Telangana
తెలంగాణ

కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం

కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం

మమందమర్రి:కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేకు వెంకటస్వామి మందమర్రి జీఎం ఆఫీస్‌కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రివర్యులు కారుణ్య నియామకాలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ,మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ , బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్ పాల్గొన్నారు.మొట్టమొదటిసారి కార్మిక శాఖ మంత్రి జీఎం ఆఫీస్‌ను సందర్శించిన సందర్భంగా పిట్ కమిటీ వారు మంత్రివర్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సత్కార కార్యక్రమంలో జీఎం ఆఫీస్ స్ట్రక్చర్ కమిటీ సభ్యులు సి.వి. రమణ, పిట్ కమిటీ సభ్యులు బింగి సత్యనారాయణ, అనంతలక్ష్మి, తోకల జ్యోతి, రమ్యసుధ, సుమలత, జలధి, లక్ష్మణ్, లక్కాకుల శ్రీనివాస్, ఇనుముల రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సామాజిక దళితోద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్

మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Share this