బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి
అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫ్టల్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి తహశీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల ఇతర పథకాల డాటా మా వద్ద లేదు అని రెవెన్యూ వారు మున్సిపల్ వారు అంటున్నారని సరైన బాధ్యత లేనందున నిరుద్యోగుల పిల్లలకు వికలాంగులకు యువతి యువకులకు విద్యార్థులకు కూలి పని చేసుకునే వారికి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అందుకే తొందరగా రేషన్ కార్డు ఇచ్చి ఇందిరమ్మ పథకం త్వరగా అందించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఎండి అఫ్టల్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ఎలిగేటి శ్రీనివాస్ 16వ వార్డ్ మాజీ
కౌన్సిలర్ దేవసాని ఆనంద్
టి పీసీసీ మీడియా జిల్లా కన్వీనర్సబ్బని రాజనర్స్ కాంగ్రెస్ నాయకులు
వెంగళ రాయమల్లు
ప్రజలు తదితరులు పాల్గొన్నారు.