సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది
ఐఎన్టీయూసీలోకి భారీ చేరికలు
ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్
సింగరేణి పరిరక్షణ కొరకు, సింగరేణి కార్మికుల భవిష్యత్తు కొరకు ఐఎన్టియుసి ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ అన్నారు. ఏరియాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మందమరి ఏరియాకు కేకే ఓసి కి చెందిన ఏఐటీయూసీ, టిబిజికెఎస్ సంఘాలకు చెందిన సుమారు 50 మంది కార్మికులు
ఆంజనేయులు నేతృత్వంలో ఐఎన్టీయూసీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ వీరందరికీ కండువాలు కప్పి ఐఎన్టీయుసిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ కొరకు, సింగరేణి కార్మికుల భవిష్యత్తు కొరకు ఐఎన్టియుసి ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని అందులో భాగంగానే డిపెండెంట్ ఉద్యోగుల వయసును 35 నుండి 40 సంవత్సరాలకు పెంచడం, హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, కోటి యాభై లక్షల రూపాయల ప్రమాద బీమాను వర్తింపజేయడం, కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇప్పించడం అలాగే వీరికి 40 లక్షల రూపాయల ప్రమాద బీమాను వర్తింపజేయడం, కొత్త గనులకై రాష్ట్ర ప్రభుత్వ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, జైపూర్ లో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకై కృషి చేయడం ఇలా అనేక రకాలుగా ఐఎన్టియుసి ముందుండి పోరాడుతున్నదని తెలిపారు. కార్మికుల చిరకాల వాంఛ ఐన సొంతింటి కలను నెరవేర్చడం, పేర్క్స్ మీద ఇన్కమ్ టాక్స్ మాఫీ చేయడం ఐఎన్టియుసి ఒక బాధ్యతగా భావిస్తుందని, ఈ కలను నిజం చేసే బాధ్యతను ఐఎన్టియుసి తీసుకుంటుందని అన్నారు. గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటియుసి నాయకత్వం పూర్తిగా విఫలమైపోయి ఐఎన్టియుసి సాధిస్తున్న విజయాలను తమ విజయాలుగా చెప్పుకుంటూ కార్మికులను మోసగించడం తప్ప కార్మికుల సంక్షేమం కొరకు వారి హక్కుల సాధన కొరకు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన దాఖలాలు లేవని, స్ట్రక్చర్ మీటింగ్ లలో తూతూ మంత్రంగా కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప సాధించిన హక్కులు శూన్యమని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఏఐటియుసి తన ప్రాబల్యాన్ని కోల్పోతున్నదని ఈరోజు మందమర్రిలో జరిగిన భారీ చేరికలే దీనికి నిదర్శనం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇంతవరకు కేకేఓసి కార్మికులకు న్యాయంగా దక్కవలసిన హెచ్ఆర్ఏ కూడా రాకపోవడం శోచనీయమని, ఏఐటియుసి నాయకత్వం ఈ విషయంలో ఏం చేసిందని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. వారికి హెచ్ఆర్ఏ వర్తింపజేసేలా యజమాన్యం పై ఒత్తిడి తీసుకొస్తామని, కేకే ఓసి కార్మికుల సమస్యలను తీర్చడానికి ఐఎన్టీయూసీ ముందుండి కృషి చేస్తుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మిక లోకమంతా ఐకమత్యంతో ఐఎన్టీయూసీని బలపరిస్తే ఖచ్చితంగా కార్మికులకు మేలు చేయడానికి ఐఎన్టియుసి వెనకాడదని రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో సింగరేణిలో ఐఎన్టియుసి తప్పక జెండా ఎగురవేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజర్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్, జాయింట్ జనరల్ సెక్రటరీ మిట్ట సూర్యనారాయణ, కేంద్ర కమిటీ నాయకులు సంఘ బుచ్చయ్య, వై సత్యనారాయణ కేకే ఓసి పిట్ కార్యదర్శి నూనె సాంబయ్య, వివిధ గనులకు చెందిన ఏరియా నాయకులు, ఫిట్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.