ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు
ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లారు. తొమ్మిది రోజుల అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని ప్రిన్సిపల్ చెప్పారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.