ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత
మందమర్రి ఫిల్టర్ బెడ్ ఏరియాలో గుడుంబా అమ్ముతున్నారని మందమర్రి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మందమరి ఎస్సై రాజశేఖర్, ఎఎస్ఐ మల్లేష్ తన సిబ్బందితో కలిసి బానోత్ కమల భర్త పేరు సాయికుమార్, అను మహిళ ఇంటి పరిసరాలలో సోదా చేయగా 06 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబా లభయమైంది. దానిని పంచుల సమక్షంలో స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసుకున్నట్లు మందమర్రి రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో మందమరి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.