బెల్లంపల్లి: ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి’
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి తహశీల్దార్ కృష్ణ తెలిపారు. అంకుశంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. భూ సమస్యలను దరఖాస్తు ద్వారా తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు. వాటిని పరిశీలించి న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. బెల్లంపల్లి చుట్టుపక్కల మండలంలో భూ సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకువస్తే న్యాయమైన పరిష్కారం చేస్తానని ప్రజలు అందరూ తమ వద్దకు వచ్చి ఎలాంటి భూవివాదమైన తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.