బెల్లంపల్లి ఎమ్మెల్యే & మంత్రి సీతక్కకు మెమోరాండం అందించిన బండి ప్రభాకర్ యాదవ్
బెల్లంపల్లి,టిపిసిసి ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ 13వ వార్డు మాజీ కౌన్సిలర్, బండి ప్రభాకర్ యాదవ్, గత 15 రోజుల క్రితం కన్నాల శివారు బెల్లంపల్లి మండలంలో సర్వే నంబర్ 112 లో అటవీ అధికారులు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ విషయమై రైతులు బండి ప్రభాకర్ యాదవ్ ని కలిసి గత 50 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న వారి జీవనోపాధి పోతుంది అని కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుందని తమ ఆవేదనను తెలియపరచడం జరిగింది. వెంటనే బండి ప్రభాకర్ యాదవ్, స్పందించి శాసనసభ్యులు గడ్డం వినోద్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ని కలిసి మెమొరండం ఇచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని కోరడమైనది. శాసనసభ్యులు గడ్డం వినోద్, వెంటనే సంబంధిత అటవీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీ దామెర శ్రీనివాస్ , 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు నాగన వేణి ఐలయ్య, నాగనవేణి నరేష్, మాచర్ల గట్టయ్య ,బండారి సారయ్య రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.