సింగరేణి వార్షిక లక్ష్యం చేరుకోవాలంటే అన్ని ప్లేడే లను వర్కింగ్ డేస్ చెయ్యాలి (HMS డిమాండ్
మందమర్రి ఏరియా H.M.S. కార్యాలయంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే.శ్రీనివాస్ మాట్లాడుతూ
గడచిన 24/25 ఆర్ధిక సంవత్సరం లక్ష్యాన్ని తృటిలోతప్పినా 69.01మి.ట. ఉత్పత్తి 65.23 మి.ట. రవాణాతో చాలా గొప్పగానే లక్ష్యసాధన కోసం ప్రయత్నించడం జరిగింది. ఈ అధ్భుత లక్ష్యసాధనలో సి&ఎం.డి. బలరాం నాయక్ విజన్ కార్మికశక్తికి అభినందనలు.పాతగనులు మూతపడడం, కొత్తగనులు రాకపోవడం
వర్షాలు విరివిగా కురవడం టార్గెట్ మిస్ కావడానికి కొంత కారణం అయ్యుండొచ్చు.
అయితే ఈ సందర్భంగా సంస్థకు లక్ష్యం , కార్మికులకు ఆర్థిక పెరుగుదల జరిగేలా H.M.S. మూడు( 3 ) డిమాండ్స్ చేస్తోంది.
మొదటి డిమాండ్ : ఒక జాతీయ సంఘంగా H.M.S. అభిప్రాయం
మేము సింగరేణి పరిరక్షణ కోసం కార్మికులకు లభ్యత కోసం కొన్ని సూచనలు తెలియచేస్తున్నాం.
ప్రజ్వల దేశ ప్రగతికోసం బొగ్గు అవసరాలు చాలా కీలకంగామారిన ఈ తరుణంలో మనం వర్కింగ్ డేస్ ను పెంచుకోవడం చాలా అవసరం సార్.
సంవత్సరానికి 300 రోజులకు బదులుగా మిగతా ముఖ్యమైన పండుగలను తప్పించి అన్ని ప్లేడేలను వర్కింగ్ డేస్ గా మారిస్తే రెండు నెలల కాలం పెరిగి చాలా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ప్లేడేలలో పెరిగే వేతనాలను మన కార్మికులకే కదా సార్ ఇచ్చేది.
ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 40 వేలకోట్ల బకాయిల ముందు ఇది చాలా స్వల్పమని మేం భావిస్తున్నాం సార్.
మొత్తం ప్లేడేలను నడపడం వలన సంస్థకు ఉత్పత్తి లక్ష్యం అలాగే కార్మికుల సంక్షేమం రెండింటినీ గొప్పగా సాధించవచ్చు.
సింగరేణి సి&ఎం.డి , ఛైర్మన్ బలరాం నాయక్ ఈ విశయంపై ఆలోచనచేయాలని H.M.S. సింగరేణి కార్మికుల తరపున మీ ధృష్టికి తీసుకవస్తున్నాం.
రెండవ డిమాండ్ : అదేవిధంగా బావితరాలకు మనం బాటలెయ్యాలంటే యువతకు భవితను చూపాలంటే ఓపెన్ కాస్ట్ లపైనే కాకుండా భూగర్భగనులు కూడా అవసరం,ప్రతీ సంవత్సరం ఓక్కో ఏరియాలో ఒక ఓ.సి. & ఒక గని తీస్తే బ్యాలన్సింగ్ బరాబర్ ఉంటుందని ఉత్పత్తి, సంక్షేమం రెండూ ఏకకాలంలో నెరవేరుతయి కాబట్టి యువతకు పనులు రావాలంటే ఇయర్లీ ప్రతీ ఏరియాలో ఒకగని, ఒక ఓసి ప్రారంభించాలని H.M.S. డిమాండ్ చేస్తుంది.మూడవ డిమాండ్ : సింగరేణి సంస్థ భవిష్యత్తు ధృష్ట్యా అనేక రంగాలలోకి విస్తరించడం శుభసూచకం మరియు అధ్భుత ఆలోచన
దీనిని H.M.S. ఘణంగా కొనియాడుతుంది.
ప్రజలు , యువత , సింగరేణీయుల పిల్లలను కూడా ధృష్టిలో పెట్టుకొని
థర్మల్ పవర్ STPP లో మరియు ఇతర సింగరేణి థర్మల్ కేంధ్రాలలో, సోలార్ సంస్థలలో , హైడ్రో , విండ్ ఇలా సింగరేణి ఏ సంస్థ పెట్టినా అందులో సింగరేణి కార్మికులే ఉండాలని H.M.S. డిమాండ్ చేస్తోంది.
ఈ కార్యక్రమంలో మందమర్రి HMS వైస్ ప్రెసిడెంట్ జే.శ్రీనివాస్ , సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, ఏరియా కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.