Praja Telangana
తెలంగాణ

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

ఏకదంతా మిత్రమండలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులను మంగళవారం స్థానిక తిలక్ స్టేడియంలో పలువురు వక్తలు అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ నాతరి స్వామి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని అభివృద్ధి చెందాలని కోరారు. క్రీడల వల్ల క్రీడాకారుల్లో స్నేహ భావం పెంపొందుతుందన తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను, కోచ్ సంతోష్ యాదవ్ ను ఆయన అభినందించారు. పతకాలు సాధించిన ఎం. హన్సిత్, త్రీ నైన్, జి.లాహిత వర్మ, ఐ. చాణక్య, కె.ఈషాన్ వర్మ, ఎ. చిన్మయి చైత్రిక, ఎ. అక్షయ, ఎం. పార్ధు, బి. కార్తికేయ, వి సుహాన్, ఎండి. సానియా,ఎం డి. గౌసుద్దీన్, టి. మనో రిత్విక్, డి.దీక్షిత్, బి. లక్ష్మి సహస్ర, మొత్తం 24 మంది మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాకర్సు అసోసియేషన్ సభ్యులు నగేష్ గోవర్ధన్, రాజన్న, సంతోష్, గణేష్ ఏకదంత మిత్రమండలి సభ్యులు శ్రీనివాస్, క్రీడాకారుల తల్లిదండ్రులు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సి సి రోడ్డు పక్కలకు మట్టి వేయాలి*

బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Share this