అలుపెరుగని కమ్యూనిస్టు, కలం యోధుడు అమరజీవి కామ్రేడ్ మునీర్ అన్నకు కన్నీటి జోహార్లు
మునీర్ అన్న ఆశయ బాటలో పయనిద్దాం, కమ్యూనిస్టుల ఐక్యతకు బాటలు వేద్దాం
అఖిలభారత కార్మిక సంఘాల కేంద్రం ఏ ఐ సి టి యు. జాతీయకార్యదర్శి సబ్బని కృష్ణ,ఎంసిపిఐ(యు)పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ పిలుపు
మహోన్నతమైన మంచి కమ్యూనిస్టు, ప్రముఖ జర్నలిస్టు మునీర్ అన్న అనారోగ్యంతో మరణించారన్న వార్త తెలియగానే హుటాహుటిన అఖిలభారత కార్మిక సంఘాల కేంద్రం ఏఐసిటియు జాతీయ కార్యదర్శి సబ్బని కృష్ణ, ఎంసిపిఐ(యు)పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ నాయకులు మంచిర్యాల పట్టణంలోని మునీర్ అన్న స్వగృహానికి వెళ్లి తన పార్థివ దేహం వద్ద విప్లవ నినాదాలతో, విప్లవ గేయాలతో జోహార్లు అర్పిస్తూ మునీర్ అన్న మహోన్నతమైన మంచి కమ్యూనిస్టు అని, బొగ్గు గని కార్మిక వర్గానికి, రైతాంగానికి, పత్రికా రంగానికి, అన్ని వర్గాల ప్రజలకు ఎనలేని సేవ చేశారని, విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షించబడి యువతను, విద్యార్థులను కూడగట్టి మందమర్రి పట్టణ ప్రాంతంలో,సమీప గ్రామాలలో వారి హక్కుల కోసం,పరిరక్షణ కోసం అలుపెరగని ఉద్యమాలు చేశారని, ఆనాటి భూస్వాములపై తిరుగుబాటు జెండా ఎగురవేశారని,జైలు జీవితాన్ని గడిపారని,పలు నిర్బంధాలను,అక్రమ కేసులను ఎదుర్కొన్నారని, ప్రముఖ కార్మిక నాయకుడు బిటి అబ్రహం శిష్యరికంలో రాష్ట్రంలోనే సంచలనాలు రేకెత్తించే ఎన్నో పోరాటాలకు పురుడు పోసారని,ఆనాటి తరానికి మునీర్ అన్న అంటే ఎనలేని అభిమానమని,ఈయన స్ఫూర్తితోనే ఎంతోమంది ప్రజలు,కార్మికులు ఉద్యమ బాట నడిచారని, ఒక శకం అంతరించిందని,ఒక ధ్రువతార రాలిపోయిందని,నేటి తరానికి ప్రముఖ జర్నలిస్టుగా మాత్రమే మునీర్ అన్న తెలుసని, మునీర్ అన్న చేసిన సేవకు కొలమానం లేదని,ఆయన నిబద్ధత,నిజాయితీ, ఆశయాలు ఉన్నతమైనవని, ఆయన జీవితం తెరిచిన పుస్తకం అని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సింగరేణి జేఏసీ కన్వీనర్ గా పనిచేశారని, తెలంగాణ సాధనలో ఆయన పాత్ర అమోఘమైనదని, ఆయన ఆశ బాటలో ప్రతి ఒక్కరూ పయనించినప్పుడే ఆయనకు సరైన నివాళులు అర్పించిన వాళ్లమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబోజి సురేష్,ఆకాష్ తదితర పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.