*తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా మహిళ కన్వీనర్ గా మద్దెల భావని*
*నియామక పత్రం అందజేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జెల కాంతం*
మంచిర్యాల,
తేది:24,మే,2025.
శ్రీరాంపూర్ నస్పూర్ కొల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన దళిత, బహుజన,మహిళ ఉద్యమ నాయకురాలు మద్దెల భవాని ని తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా మహిళ కన్వీనర్ గా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం మాట్లాడుతూ కొంత కాలంగా క్రియాశీలక సభ్యులుగా పనిచేసిన మద్దెల భావాని ని వారి ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి జిల్లా మహిళ కన్వీనర్ గా నియమించడం జరిగిందన్నారు.జిల్లాలో మహిళ కమిటీల ఏర్పాటుతో పాటు దళితుల సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. అనంతరం మహిళ కన్వీనర్ మద్దెల భావాని మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం కి ధన్యవాదాలు తెలిపారు. సంఘ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. దళితుల సమస్యలపై మహిళల సమస్య లపై ఉద్యమిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నా ఎన్నికకు సహకరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్, మానకొండూర్ మాజీ జెడ్ పి టి సి కొండ్రా స్వరూప కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ రావు,సుద్దాల లక్ష్మణ్,మీసాల సాయిలు,కాదసి ప్రభాకర్,అనిల్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.