బెల్లంపల్లి, తాండూర్ మండల్ లో అండర్ బ్రిడ్జిలో వరద నీరు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తాండూరు మండలంలోని కాసిపేట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రైల్వే అండర్ పాస్లో వరద నీరు భారీగా చేరింది. వరద నీటికి తోడు మురికి నీరు వెళ్లే పైపులైన్ పుడుకుపోవడంతో వాటర్ తో అండర్ పాస్ బ్రిడ్జి జలమయం అయింది. దీంతో పలు గ్రామాల వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే, మండల అధికారులు స్పందించి మురికి నీరు, మట్టి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు & వాహనదారులు కోరుతున్నారు