Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి ఆటో రథయాత్రను విజయవంతం చేయండి

బెల్లంపల్లి ఆటో రథయాత్రను విజయవంతం చేయండి

ఆటో యూనియన్ నాయకుడు కట్ట రామ్ కుమార్

ఏప్రిల్ 25వ తేదీన మెదక్ జిల్లా నుండి ప్రారంభమైన ఆటో రథయాత్ర 33 రోజుల పర్యటన ముగించుకొని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మే 27న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆటో యూనియన్ నాయకుడు కట్ట రామ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు కాకముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం మహాలక్ష్మి పథకం ఆర్టిసి బస్సులలో మహిళా సోదరీమణులకు ఫ్రీగా ఆధార్ కార్డు ప్రయాణం ఇవ్వడం వలన మహిళా సోదరీమణులు ఆటోలలో ఎక్కకపోవడం ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయి మనస్థాపానికి గురై ఫైనాన్స్లో కట్టలేక ఇంటి అద్దెలు కుటుంబ పోసిన భారమై సూసైడ్లు చేసుకుని చనిపోయిన ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను మరొక ఆటో డ్రైవర్లు చనిపోకూడదన్న ఉద్దేశంతో 33 రోజుల రాష్ట్రవ్యాప్త ఉన్న జిల్లాలు మండలాలు పాదయాత్రల ద్వారా ఒక్కటే ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద ఆటో ఆకలి కేకలు మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. మే 27వ తేదీన ఆటో డ్రైవర్లు భారీ ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని ఆటో ఆకలి కేకలు మహాసభలు విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ పిలుపునిస్తున్నానని ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేసే వరకు పోరాటాలు ఆగవని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఇల్లు లేని ఆటో డ్రైవర్ కు ఇందిరమ్మ ఇల్లు ఆటో డ్రైవర్ ఏ కారణం గా చనిపోయిన ఆటో బీమా పథకం ద్వారా చనిపోయిన ఆటో కార్ డ్రైవర్ కుటుంబానికి ప్రభుత్వము ద్వారా 5 లక్షల రూపాయలు అందజేయాలి రైల్వే స్టేషన్లలో ఆర్టీసీ బస్ స్టాప్ లో ముందు మెయిన్ సెంటర్లలో ప్రత్యేక ఆటో పార్కింగ్ ఏర్పాటు చేయాలి, ఈ ఛానల్ ల ద్వారా పోలీసు వారు విధిస్తున్న రాంగ్ పార్కింగ్లో చాలల్లు వెంటనే తాపీ వేయాలి ఇప్పుడున్న పరిస్థితులలో కుటుంబ పోషనే భారమై ఆటోలు నడపడమే చాలా కష్టం ఉన్న తరుణంలో రాంగ్ ఆటో పార్కింగ్ ను లేని చోట ఆటో ఆపి ప్యాసింజర్లను దించితే రాంగ్ పార్కింగ్ అని అడ్డగోలు పెనాల్టీలు వస్తున్నాయి నీ వెంటనే ఆపివేయాలి మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఇరువైపులతోపుడు పనులను తొలగించి ఆటో పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జిల్లా నాయకులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Chief Editor: Satish Kumar

ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ

Share this