పాత్రికేయులకు సన్మానించిన న్యాయవాది నల్లుల సంగీత
బెల్లంపల్లి పట్టణంలో మోడీ క్యాంటిన్ ఆధ్వర్యంలో,బుధవారం న్యాయవాది నల్లుల సంగీత బుధవారం పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా సంగీత మాట్లాడుతూ..మోడీ క్యాంటిన్ సుమారుగా నాలుగు ఐదు సంవత్సరాలనుండి నిర్వహిస్తున్నామని,
నిరుపేదలకు సేవచేయడమే లక్షంగా ఈ మోడీ క్యాంటిన్ నడుపుతున్నమ్మన్నారు. గతం నుండి ఈనాటి వరకు మోడీ క్యాంటిన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసన్నారు.ఈ మోడీ క్యాంటిన్ సేవ కార్యక్రమాలు ఈ ఒక్క బెల్లంపల్లి పట్టణానికే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి విస్తరించేలాగా చేస్తామన్నారు.అలాగే బుధవారం స్థానిక పాత్రికేయులకు న్యాయవాది సంగీత శాలువాలతో సన్మాన కార్యక్రమం చేపట్టారు. పాత్రికేయులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజానికానికి వరదులుగా పనిచేస్తున్నారన్నారు.ఎక్కడో జరిగిన సంఘటనలను చేరదీసి వారు ప్రపంచానికి తెలియజేస్తున్నారన్నారు.
అట్టి పాత్రికేయులను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.