*తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్*
*అందాల పోటీల పేరుతో కోట్లాది రూపాయలు వృధా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్*
*ఎలక్షన్ల ముందు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇంటింటికి మహిలల కు 2500 రూపాయల పెన్షన్లు మంజూరు చేయాలి*
ఎంసిపిఐ యు పార్టీ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, ఎం సిపిఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దేనెక్కి 18 నెలలు గడిచినా కూడా ఎలక్షన్ల ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అందాలపోటీల పేరుతో కోట్లాది రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తుందని తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు అన్యాయం చేస్తుందని కళ్యాణ లక్ష్మి కింద ఒక లక్ష 16 రూపాయలు తో పాటు తులం బంగారం ఇస్తామని ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని అందాల పోటీల పేరిట 3270 తులాల బంగారాన్ని పక్క దేశంలో ఉంటున్న ఆడపడుచులకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అదేవిధంగా మహిళలకు ఇంటికి 2500 పెన్షన్ ఇస్తానని రేవంత్ సర్కార్ మాట తప్పిందని వాపోయారు అదేవిధంగా చదువుకుంటున్న ప్రతి యువ మహిళకు స్కూటీ ఇస్తానని కూడా మాట తప్పారని ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి ఆరెపల్లి సతీష్, తోగరి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.