Praja Telangana
తెలంగాణ

బి.సి ఢిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

బి.సి.ఢిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి
బహిరంగ లేఖ

నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బి, సి డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే
1) ఎం. బి. సి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని
2) బి. సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని
3) 5 సంవత్సరాలలో బి. సి ల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని
4) అన్నీ జిల్లా కేంద్రాలలో బి. సి
భవనాలు నిర్మిస్తామని
5) నామినేటెడ్ పదవుల్లో 50% అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
బి. సి డిక్లరేషన్ సభలో హామీలు ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టి ఒక సంవత్సరంనర అవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదు అంటే కేవలం బి. సి. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బి. సి లకు హామీ ఇచ్చినట్లుగా జాతీయ బి. సి హక్కుల పోరాట సమితి గా భావిస్తున్నాము.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ద్రుష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రభుత్వం బి. సి సమాజం ముందు దోషిగా నిలబెడుతాం అని హేచ్చరిస్తున్నాం..ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,
నాయకులు:గజేల్లి వెంకటయ్య,శాఖపురి భీంసేన్,అంకం సతీష్,షేక్ సల్మాన్ ఖాన్,కీర్తి బిక్షపతి,చెలిమెల అంజన్న, మహిళా నాయకురాలు శ్రీమతి లలితా ముదిరాజ్, రవి కిరణ్, రాజం తదితరులు పాల్గొన్నారు

Related posts

తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనకు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రం ఎంపిక

భూభారతి చట్టంను గ్రామంలో రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా అమలు చేయాలి*

Chief Editor: Satish Kumar

రాజీవ్ గాంధీ, ఆశయాలను,కొనసాగించాలి ఎమ్మెల్యే గడ్డం వినోద్,

Share this