Praja Telangana
తెలంగాణ

ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ

ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ

బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి

నేటి ప్రజా తెలంగాణ:బెల్లంపల్లి

కాసిపేట మండలం దబ్బగూడెం గ్రామంలో కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సంబంధిత భూమిర్వాసితులకు ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
299 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాది వరకు ఆర్&ఆర్ కాలనీలో వాటర్ ట్యాంక్, బడి, గుడి గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం మరియు అన్నిరకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.అలాగే
సింగరేణి లో భూములు కోల్పోయిన మిగత భూనిర్వాసితులను గుర్తించి పూర్తి స్థాయిలో సర్వే చేసి వారికి కూడా స్థలాలు కేటాంచాలని ఆర్డీవో హరికృష్ణ, మందమర్రి సింగరేణి జిఎం దేవేందర్ లకు ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Related posts

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన రామ్ అక్షరేష్

తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనకు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రం ఎంపిక

Share this