Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి టి ఎన్ టి యు సి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం

బెల్లంపల్లి టి ఎన్ టి యు సి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం

బెల్లంపల్లి, ఏప్రిల్ 7 నేటి ప్రజా తెలంగాణ

బెల్లంపల్లి తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ కార్మిక సంఘం టిఎన్టియుసి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల సదస్సు తేదీ 8,-4-25 నాడు అనగా మంగళవారం ఉదయం 10 గంటలకు బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరుగును ఈ సదస్సుకు అన్ని కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు అని టి మనీ రామ్ సింగ్ తెలిపారు. ఈ సదస్సు ముఖ్య ఏజెండా అసంఘటిత కార్మికుల కనీస వేతనాలను వెంటనే సవరించాలని ఈపీఎఫ్ పెన్షన్ వెంటనే 10000 రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి పెండింగ్లో ఉన్న జీవో నెంబర్లు 21 22 23 24 25 లను గెజిట్లో ముద్రించి ప్రకటించాలని కార్మిక సమస్యల పరిష్కారం కొరకు చర్చ ఈ సదస్సులో పైన చెప్పిన అన్ని అంశాలు ఉంటాయి కావున టి ఎన్ టి యు సి దాని అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కు చెందిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన భవన్లో హాజరై విజయవంతం చేయాలని టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి టీ మణిరాం సింగ్, తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ నాయకులు. టి ముని రాంసింగ్ ప్రధాన కార్యదర్శి గద్దల నారాయణ ఉపాధ్యక్షులు ఓ జీవరత్నం బొల్లు మల్లయ్య ఎం నవీన్ ఏ రమేష్ ఎండి పాషా సిహెచ్ రమేష్ పి యాదగిరి భూపెల్లి కొమరయ్య బి సత్యనారాయణ మాదాసి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో చర్యలు

BSNL శుభవార్త: సిమ్ డోర్ డెలివరీ

Share this