దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి……….
నేటి ప్రజా తెలంగాణ :సిద్దిపేట జిల్లా
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం చెందిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పిల్ల కాలువలు కూడా చేపట్టడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో మెయిన్ కెనాల్ కాల్వ ద్వారా రెండు గ్రామాల ప్రజలు సొంత డబ్బులతో పిల్ల కాలువలను జేసీబీ ద్వారా నిర్మించుకొని చెరువులు నింపుకోవడం అభినందనీయమన్నారు.
:-స్వయంగా రైతులే జేసీబీల ద్వారా…….
ప్రభుత్వం చేయాల్సిన పనిని రైతులు ముందుకు వచ్చి సొంత డబ్బులతో మెయిన్ కెనాల్ ద్వారా పిల్ల కాలువతో చెరువులు నింపుకొని పంటలు పండించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేయడం పట్ల ఆయన రైతులను అభినందిస్తూ పటేల్ కుంట, పెద్ద చెరువు, కుమ్మరి కుంట, కన్నె కుంటల మత్తడిల వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నిర్మించడంతో దుబ్బాక నియోజకవర్గంలో లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా మెయిన్ కెనాల్ నిర్మించి రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ పెద్ద కాలువలు నిర్మించారని మండే ఎండలో చెరువులు అలుగు పారాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మెయిన్ కెనాల్ నుంచి చిన్న కాలువలు తీయడంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్వయంగా రైతులే జేసీబీల ద్వారా చేసుకుంటున్నట్లు ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు ఆయన గుర్తు చేశారు.
రామాయంపేట్ కెనాల్, శంకరంపేట కెనాల్, దుబ్బాక కెనాల్, సంగారెడ్డి కెనాల్ నుండి నీళ్లు వదిలితే యాసంగి వరి పంటలు పండేవని పిల్ల కాలువలు మరమ్మత్తు లేక చాలా ప్రాంతాల్లో వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా లో వున్న మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా మెయిన్ కెనాల్ నుంచి అన్ని గ్రామాలకు పిల్ల కాలువలు నిర్మించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
:-రైతులకు సన్మానం………
కాగా దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లోని చెరువుల్లోకి నీళ్లు రావడానికి ఎంతో కృషి చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయా గ్రామాల రైతులు శాలువాతో సన్మానించారు. రైతులు కష్టపడి చెరువుల్లోకి సొంత డబ్బులతో నీరు తెచ్చుకోవడాన్ని అభినందిస్తూ దొమ్మాట తాజా మాజీ సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి, గాజులపల్లి తాజా మాజీ సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు. నాయకులు తదితరులు పాల్గొన్నారు……….