పార్లమెంట్ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో మహాసభ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రులు, శ్రీధర్ బాబు, సీతక్క, మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సీతక్క కామెంట్స్….
1) ఎంపి ఎన్నికల తరవాత నామినేటెడ్ పదవుల్లో ఉంటారు
ఇక్కడి నేతల మధ్య బేధాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ ఢిల్లీ పెద్దలు రాహూల్ ను ప్రధాని చెయ్యడంలో ఎలాంటి బేధాభిప్రాయాలు ఉండవు.
2) కాంగ్రెస్ ఉపాధి చట్టం తేకుంటే ఊర్లల్లో రోడ్లు ఉండేవి కావు…
3) మోది ప్రభుత్వం అటవీ హక్కుల కు తూట్లు పొడిచారు.
4) మోదీకి ఆధాని, అంబానీ తప్పా ఎవ్వరు కనిపించడం లేదు.
5) సింగరేణి ని ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.
6) ఉద్యోగాలు లేవు. దేశ వనరులను దోస్తులకు దొచిపెట్టుతుండు.
7) పేదొల్లకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ..
8) ఫొన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం ను పక్కదారి పట్టించడం కోసం కేసీఆర్ దొంగ రైతు దీక్షలు చేపిస్తున్నారు.
9) కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మిగులు బడ్జెట్ ఉంచాము. విభజనలో లబ్ది చేకూర్చే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే….
మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్…
1) అభ్యర్థులను చూసి ఓటు వేయండి…
2) పెద్దపల్లిలో యువకుడి వంశీ ని ముందుంచాం.
3) నేతకానీ సంక్షేమ కోసం కృషి చేస్తాం.
4) మేము ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటాము.
5) ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం.
6) ప్రభుత్వ పనులకు కోడ్ వల్ల ఆటంకం కలిగింది.
7) 2018 ఎన్నికలు జరిగిన తరువాత రెండు నెలల తరువాత పాలన మొదలు పెట్టారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో పథకాలను ప్రారంభించి పాలన మొదలుపెట్టాం.
8) 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. గృహలక్ష్మి జీరో బిల్లు ఇస్తున్నాం, ఇంకా మా భాధ్యత ఉంది.
9) గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ ను దారిలో పెట్టుతున్నాము.
10) 2 వందల యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇవి బీఆర్ఎస్ పార్టీ వాల్లు సైతం పొందుతున్నారు. ఇస్తున్నాం అంటే ఓట్లు మాకే వేయండి.
11) కేసీఅర్ ఆర్థిక వ్యవస్థను ఆగం చేసారు…
12) 7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాక ఐదేళ్లు పాలన గడిచిన తరవాత ఇవ్వక పొతే అడగండి.
13) బీఆర్ఎస్ పెద్దలు రైతులను లూటీ చేసారు. పైగా ఇప్పుడు రైతుల కోసం అంటూ ధర్నాలు చేసారు.
14) అలాంటి వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.
15) నీటి లభ్యత విషయంలో అక్టోబర్ మాసంలో తక్కువగా ఉందని వాళ్ల పత్రికల్లోనే రాసుకున్నారు.
16) ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ల కరువు అంటున్నారు. మేము అధికారంలోకి వస్తే కరువు వచ్చింది అంటున్నారు.
17) కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కుంగిపోతే మేము ఎం చెయ్యడం లేదని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్ళు వాళ్ళు వదిలి పెడితే మేము వదిలి పెట్టాం అని అబద్ధాలు చెప్పుతున్నారు.
18) ఎక్కడ బీఆర్ఎస్ ఒక్క సీటు గెల్వదు. కాబట్టి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు…
19) కాంగ్రెస్ పై బీఅర్ఎస్, బిజేపి ఆరోపణలను తిప్పికొట్టాలి…
20) ఆరు గ్యారంటీల అమలును ఇంటి ఇంటికి తీసుకెళ్ళి ఓట్ల అడగండి అని పిలుపునిచ్చారు…