Praja Telangana
తెలంగాణ

*టీఎన్జీవో భవనంలో జగ్జీవన్ జయంతి వేడుకలు*

మంచిర్యాల:ఏప్రిల్ 05 ( ప్రజా తెలంగాణ)

భారత తొలి ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల టిఎన్జీవో భవనంలో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ ఉపప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలపై కొనియాడారు. జగ్జీవన్ జాతికి దేశానికి ఎనలేని సేవ చేశారని వారి అడుగుజాడల్లో మనమందరం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత రాజ్యాంగ రక్షణకై జగ్జీవన్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కేజియా రాణి, రామ్ కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, ఉపాధ్యక్షులు ప్రకాష్, లక్షెట్టిపేట యూనిట్ కార్యదర్శి వేణు సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రము లొ 45 డిగ్రీలు దాటిన ఎండలు*

ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఘనంగా 138వ మే డే వేడుకలు*

కాంగ్రెస్ పార్టీలో చేరిన. గాండ్ల సమ్మయ్య

Share via