October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*ఎన్ఎస్ఎస్‌తో విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది*

మంచిర్యాల,సెప్టెంబర్ 24(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1, యూనిట్-2 ఆధ్వర్యంలో గురువారం ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ద్వారా యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎన్ఎస్ఎస్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎం. కుమారస్వామి, డాక్టర్ కె. రాజయ్య, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

షార్ట్ కట్ మార్గాల ప్రయాణం ప్రమాదం. సరైన మార్గమే సురక్షితం…

Share this