మందమర్రి,సెప్టెంబర్ 5 (నేటి ప్రజా తెలంగాణ):జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మందమర్రి జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి నిరోషా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మందమర్రి న్యాయస్థానంలో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా వివిధ రకాల పెండింగ్ కేసులు, కోర్టుకు వెళ్లకముందు ఉన్న వివాదాలను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సత్వరంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.దీనివల్ల సమయం, న్యాయపరమైన ఖర్చులు ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ ప్రక్రియకు సులభమైన పరిష్కారం లభిస్తుందని వివరించారు.కావున మందమర్రి మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమకు సంబంధించిన కేసులు, వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు సెప్టెంబర్ 12న మందమర్రి న్యాయస్థానానికి హాజరు కావాలని జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి నిరోషా గారు కోరారు.పరస్పర అంగీకారంతో వివాదాలకు సత్వర పరిష్కారం పొందేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

