September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*పోలీసులకు రాఖీలు కట్టిన పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు*

మంచిర్యాల,ఆగస్టు 27(నేటి ప్రజా తెలంగాణ):సమాజ రక్షణలో నిరంతరం సేవలందిస్తున్న పోలీసులను సోదరులుగా భావిస్తూ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు రక్షాబంధన్ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మంచిర్యాల డిసిపి కార్యాలయాన్ని సందర్శించి డిసిపి తో పాటు పోలీస్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి తమ ప్రేమ, గౌరవం, కృతజ్ఞతను చాటుకున్నారు.ప్రజల భద్రత కోసం పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది అందిస్తున్న సేవలను విద్యార్థులు తెలుసుకున్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, క్రమశిక్షణ పాటించాల్సిన ఆవశ్యకతపై అవగాహన పొందారు. విద్యార్థులు పోలీసులకు రాఖీలు కట్టడం ద్వారా పోలీస్ శాఖతో చిన్నారుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటిచెప్పారు.

విద్యార్థుల ఆప్యాయత అభినందనీయం: డిసిపి

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. విద్యార్థులు పోలీసులకు రాఖీలు కట్టి చూపించిన ఆప్యాయత ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. చిన్నారుల్లో చిన్ననాటి నుంచే సమాజం పట్ల బాధ్యత, పోలీసుల పట్ల గౌరవ భావం పెంపొందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి భద్రతకు సహకరించాలని సూచించారు.విద్యార్థులను పోలీస్ అధికారులు అభినందించి, మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ఈ కార్యక్రమం పోలీసుల సేవలకు గౌరవాన్ని చాటడంతో పాటు చిన్నారుల్లో సామాజిక బాధ్యత, భద్రతపై అవగాహన పెంపొందించేలా సాగింది.

“రాఖీ ఒక దారం మాత్రమే కాదు.. మనలను రక్షించే వారికి మన ప్రేమ, గౌరవం, కృతజ్ఞతకు ప్రతీక.”

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మల్లిక, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

*గొర్రెల దొంగతనం కేసు ఛేదన.. నలుగురు నిందితుల అరెస్టు, గొర్రెతో పాటు మూడు ఆటోలు స్వాధీనం*

*వెంకటాపూర్‌లో పీవీటీజీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: అదనపు జిల్లా కలెక్టర్ పి.చంద్రయ్య*

Chief Editor: Satish Kumar
Share this