July 28, 2026
Praja Telangana
తెలంగాణ

నరేంద్ర మోడీపై అమితాభిమానం చేతిపై టాటూ వేసుకున్న బిజెపి నాయకురాలు నల్లుల సంగీత

బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన బిజెపి నాయకురాలు, న్యాయవాది నల్లుల సంగీత ఎన్నాళ్లుగానో మోడీ కాంటీన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. ప్రజలకు అండగా నిలిచి, ఆకలి బాధలను తీర్చేందుకు ముందుండే ఆమె సేవలు స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి దిశగా పథకం ప్రకారం ముందుకు సాగుతుందనే నమ్మకంతో, ఆయనపై తనకున్న అభిమానాన్ని తెలియజేసేందుకు నల్లుల సంగీత ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ‘నరేంద్ర మోడీ మనిషి మాత్రమే కాదు… మానవ రూపంలో ఉన్న దేవుడు’’ అంటూ చెబుతూ, తన చేతిపై నరేంద్ర మోడీ’’ పేరుతో టాటూ వేయించుకున్నారు.
దేశ సేవలో ఆయన చూపుతున్న కృషి, ప్రజల కోసం చేస్తున్న పణి తనను ఎంతో ప్రేరేపించిందని, తన సేవలు కూడా ప్రజలకే అంకితం అని సంగీత పేర్కొన్నారు. మోడీ ఆశయాలను గ్రామాల వరకు తీసుకెళ్లేందుకు, సేవా కార్యక్రమాల ద్వారా మరింతగా పనిచేస్తానని తెలిపారు.మోడీ అభిమాని మాత్రమే కాకుండా, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి చేర్చడంలో ముందుండే నల్లుల సంగీత ప్రస్తుతం బెల్లంపల్లి ప్రాంతంలో బిజెపి కార్యకర్తలకు స్పూర్తిగా నిలుస్తున్నారు.

Related posts

బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం

*రామకృష్ణాపూర్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన*

Share this