Praja Telangana
తెలంగాణ

ఘనంగా కుంకుమ పూజలు తరలి వచ్చిన మహిళలు

ఘనంగా కుంకుమ పూజలు
తరలి వచ్చిన మహిళలు

మంచిర్యాల
జిల్లాకేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు, మహిళలు తరలి వచ్చారు.. వంద ఫీట్ల రోడ్డు వద్ధ అంజనీ పుత్ర సంస్థ కార్యాలయ ఆవరణ లో కొలువైన లంబోదరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి, ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గణనాథుని వద్ద మహిళలు కోలాటాలు ఆడి భక్తులను అలరించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వినాయక చవితి పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రేమను రాగాలతో కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి అన్నారు. అనంతరం మహిళా మణులతో 3000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, సంస్థ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Related posts

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

డాక్టర్ ఏ సందర్భంగా గవర్నమెంట్ డాక్టర్లకు సన్మానించిన బీఎస్పీ నాయకులు

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*

Share this