Praja Telangana
తెలంగాణ

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి

*వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి*

వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. మంగళవారం ప్రపంచ వ్యవసాయ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో అన్నదాతలు ముఖ్యంగా సన్నకారు రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు కొనుగోలు దారుల నడుమ దళారీ వ్యవస్థను నిర్మూలించనంతకాలం ప్రయోజనం ఉండదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఆహార భద్రతను కలిగించినా, రైతులకు మాత్రం *ఆదాయ భద్రతను ప్రభుత్వాలు ఇవ్వలేక పోతున్నాయని అన్నారు* ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన సరుకులను రైతుల నుంచి ప్రభుత్వం కనీస మద్దతు ధరలతో కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రత్యేక యంత్రాంగంగా నెలకొల్పాలన్నారు.ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో దళారు వ్యవస్థను నిర్మూలించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్నారు.కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కుమ్మం సురేందర్, కలువల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

Share this