బెల్లంపల్లి రోడ్ల దుస్థితి
పట్టించుకోని అధికారులు
వివరాలు తెలిపిన బిజెపి నాయకురాలు న్యాయవాది నల్లుల సంగీత
బెల్లంపల్లి పట్టణలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి, బజారు ఏరియా మార్కెట్ వరకు రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా మారి ప్రజల వాహనాల రాకపోకలకు ఇబ్బంది మారిన ఏ అధికారులైనా ఆర్&బి అధికారులు పట్టించుకోవడం లేదని బెల్లంపల్లి బీజేపీ నాయకురాలు న్యాయవాది నల్లుల సంగీత ఆరోపించారు.రాత్రి సమయంలో రోడ్లపై నిలిచిఉన్ననీళ్లతో గుంతలు కనపడక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎవరికైనా టూ వీలర్ వాళ్లు బండ్లు అదుపు తప్పి పడిపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, అలా అయితే వాళ్ల కుటుంబాలు రోడ్డు మీద పడతాయని అలాంటి సంఘటన జరగకముందే అధికారులు స్పందించి ఈ రోడ్ల మరమ్మత్తు చేయాలని వెంటనే అధికారులు స్పందించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని కోరారు, లేనిపక్షంలో ప్రజలతో ఇదే రోడ్లపై కూర్చొని ధర్నా చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు