డిగ్రీ సీటు జూలై1వ తేదీలోపు కన్ఫామ్ చేసుకోగలరు
– బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు పొందిన విద్యార్థులు గమనించగలరు
– ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్లలో భాగంగా మూడవ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 1వ తేదీలోగా కళాశాలలో ఒరిజినల్ టిసి సమర్పించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీటు కన్ఫామ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్, దోస్త్ కోఆర్డినేటర్ మేడ తిరుపతి కోరారు. కళాశాలలో బిఏ, బీకాం టాక్సేషన్, బీకాం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ తదితర కోర్సులలో విద్యార్థులకు జూన్ 28న సీట్లు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. 1వ తేదీ దాటితే డిగ్రీ సీటును కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. కావున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నంబర్ 9959269975లో సంప్రదించగలరని సూచించారు.