*ఎమ్మెల్యే చేతుల మీదుగా ల్యాప్ టాప్ అందజేత*
*విద్యార్థులు ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని పొందాలి*
*బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*
కాసిపెట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన తీగల శ్రీనివాస్ రావు సుజాత ల కుమారుడు ఆశ్రిత్ ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో శాలువతో సన్మానించి ల్యాప్ టాప్ ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల ప్రపంచంతో పోటీ పడే విదంగా చదువులో ముందుకు సాగాలన్నారు. ఉన్నత విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.విద్యార్థుల ఉన్నత విద్యాబ్యాసానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. జాతీయ స్థాయి జె ఈ ఈ ఎంట్రెన్స్ ద్వారా మంచి ర్యాంక్ సాధించి సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రవేశం పొంది విద్యను అభ్యసిస్తున్న తీగల ఆశ్రిత్ ని భవిష్యత్ లో గొప్ప స్థాయిలో ఉండాలని ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిసి విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించాలని ఉద్దేశ్యంతో వారికి ల్యాప్ టాప్ లను అందజేసిందన్నారు.ఏల్లప్పుడూ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ కాసిపెట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మాట్లాడుతూ మా మండలం నుండి సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యానభ్యసించే ఆశ్రిత్ ని అభినందించారు.అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ని తీగల శ్రీనివాస్ రావు కాసిపెట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్ డి ఓ హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ కాసిపెట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్,ప్రధాన కార్యదర్శి మైదం రమేష్, నాయకులు మెరుగు శ్రీనివాస్, విద్యార్థి తండ్రి తీగల శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.