మహానాడు 2025 వేడుకకు అందరూ కదలిరండి
బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు టీ మణి రామ్ సింగ్ ఆహ్వానం
బెల్లంపల్లి, నియోజకవర్గం నుండి టిడిపి కార్యకర్తలు అందరికీ పట్టణ అధ్యక్షుడు తరుపున మహాసభకు ఆహ్వానం ఈనెల 27, 28, 29, తేదీలలో కడప సమీపంలోని సీకే దీన్నె మండలం, చెర్లోపల్లి పబ్బపురం గ్రామాల పరిధిలో జరుగు మహానాడు 2025 కు బెల్లంపల్లి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు కదిలి రావాలని తెలిపారు. అలాగే తమ వద్ద ఉన్న తెలుగుదేశం సభ్యత కార్డు తప్పకుండా తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహానాడు 2025 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం కడప సమీపంలోని మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు ఘనంగా,జరుగుతున్నాయి. టీడీపీకార్యకర్తలారా మహానాడును చారిత్రాత్మకం చేసేందుకు సిద్ధం అవ్వండి, అని పిలుపునిచ్చారు.