యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ ఘనంగా జయంతి వేడుకలు
నేటి ప్రజాతెలంగాణ:మందమర్రి
మందమర్రి పట్టణం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని* మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకులు పూలే గారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది.యూత్ కాంగ్రెస్ నాయకుడు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ అంటరానితనం,కుల వ్యవస్థ నిర్మూలన,అణగారిన కుల లకు విద్యను అందించడంలో మహాత్మ జ్యోతిరావు పూలే ఎంతో పోరాటాలు చేయడం జరిగింది. ఆ మహనీయుని స్ఫూర్తి వల్లనే విద్య ఒక్కటే యువత జీవితాలను మారుస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు
బియ్యపు రవి కిరణ్,సొత్కు ఉదయ్,రామసాని సురేందర్,ఒజ్జ గణేష్, నెరువట్ల సుజిత్,సాధుల చింటూ,అన్వేష్,రాజేష్,మహేందర్,కిరణ్,అష్రాఫ్,సతీష్ మరియు ఆటో యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు.