బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో
బెల్లంపల్లి పట్టణం లో. బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ హాజరవడం జరిగింది. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.